Thursday, 26 January 2017

శాంతియుత ధర్నా చేస్తామంటే ప్రభుత్వానికి అంతటి భయమెందుకు? ప్రతిపక్షంలో ఉన్నపుడు తామెన్నడూ ఇలాంటివి చెయ్యలేదా? అప్పట్లో లెక్కకు మిక్కిలి ధర్నాలు, నిరసనలు చేసి చరిత్ర సృష్టించినట్టున్నారు కదా. తమరు చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే మరొకటా? ఇప్పటికైనా చంద్రబాబు ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి, ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రంతో పోరాడాలి. పోరాడితే పోయేదేమీ లేదు. వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఉద్ధరిస్తున్నదేమీ లేదు, నాలుగు ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నట్టు ఉంది తప్పించి. తమిళనాడులో జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు విజయవంతమయ్యామంటే కారణం ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, కేంద్రంతో పోరాడి సాధించింది. కానీ, ఇక్కడ ప్రజలు అప్పట్లో స్వయంగా మోడీ ఇచ్చిన హామీపై పోరాడుతుంటే, చంద్రబాబు అణచివేయాలని చూస్తున్నారు. హోదా ఎందుకు వద్దో మీరు చెబుతున్నారు, ఎందుకు కావాలో వారు చెబుతున్నారు. హోదా కావాలంటూ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామంటే దానిని అణిచివేయాలని చూడటం గర్హనీయం. ఇప్పటికైనా చంద్రబాబు మేలుకోవాలి, ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. కేంద్రంతో పోరాటం చేతకాకపోతే కాకపోయే, కానీ పోరాడేవారిని అడ్డుకోవటం మాత్రం చెయ్యకండి.

No comments:

Post a Comment