Tuesday, 24 January 2017

మనం చెప్పుకుంటూంటాం 'మేకలను బలి ఇస్తారు కానీ పులులను ఇవ్వలేరు' అని. ఈ పెటా తదితర మేధావి లేదా జంతుప్రేమిక వర్గాలు కూడా అంతే. జల్లికట్టు లాంటి సంవత్సరానికి ఒకసారో లేదా రెండుసార్లో జరిగే విషయాల మీద పోరాడతారు తప్పించి ప్రతిరోజూ జరిగే మాంసాహారం తంతుని నిషేధించమని మాత్రం ఉద్యమించరు. ఇక్కడ పోరాటం అనగా న్యాయస్థానాలలో వ్యాజ్యం వేయటం, వాదనలు వినిపించి న్యాయస్థానాలు ఒప్పుకునేలా చేయటం అని నా ఉద్దేశ్యం. అలా అడిగితే 'ఆ దిశగా చాలా చేస్తున్నాం' అంటారు; ఏమి చేస్తున్నారయ్యా అంటే ఎదో ఒక సెలెబ్రిటీని పట్టుకుని బట్టలిప్పించి ఫోటోలు తీసి దాన్నే ఒక పోరాటంగా చెప్పుకోవటం, ఎవరో ఒక సెలెబ్రిటీతో ఒక వాక్యం చెప్పించటం. మరి అదే తరహా పోరాట ధోరణిని ఈ జల్లికట్టు తరహా వాటిలో ఎందుకు అవలంబించరు? ఎవరో ఒక సెలెబ్రిటీని పట్టుకుని బట్టలిప్పించి ఫోటో సెషన్ అదే జల్లికట్టుకు వ్యతిరేకంగా చెయ్యండి. ఏదో చేసామన్న తృప్తి తమరికి ఉంటుంది, అలానే మాకూ నయనానందకరంగా ఉంటుంది. శకుంతలాకియా నువ్వన్నా సెప్పరాదూ ... 

No comments:

Post a Comment