Tuesday, 24 January 2017

జల్లికట్టు నిషేధం/నిషేధం ఎత్తివేత అన్న అంశాల విషయంలో నాకు తెలిసినంతవరకూ "పెటా అనే ఒక సంస్థ స్త్యున్నత న్యాయస్థానంలో 'జంతుహింస' అనే అంశాన్ని ప్రాతిపదికగా చూపుతూ జల్లికట్టును నిషేధించాలని వ్యాజ్యం వేశాయి. వారి వాదనలు విన్న న్యాయస్థానం జల్లికట్టును నిషేధిస్తూ తీర్పునిచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ తమిళులు ఆందోళనబాట పట్టారు." బహుశా ఇంతే అనుకుంటా. కానీ, మధ్యలో దీనికి మోడీకి లంకె పెట్టటం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. అక్కడికీ, మన తెలుగు వాళ్ళ గోడు పట్టనప్పటికీ భౌగోళికంగా మనక్రింద ఉన్న రాష్ట్రమైన తమిళనాడులోని తమిళుల ఆందోళన గుర్తించిన ఆయన ఒక ఆర్డినెన్స్ తెస్తూ జల్లికట్టు నిర్వహించుకునేలా చేస్తానని హామీనివ్వటమే కాక ఆ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు కూడా చేపట్టినట్టున్నారు. మరి ఇందులో మోడీని విమర్శించాల్సిన అగత్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే పెటా ఈ వ్యాజ్యం వేసింది కూడా ఎప్పుడో 2012 లో అనుకుంటా అప్పుడు కేంద్రంలో ఉన్నది యుపిఏ ప్రభుత్వం. ప్రతిదానికీ మోడీకి లంకె పెట్టటం ఎంతవరకూ సబబు? ఇదేదో బోడిగుండు, మోకాలు వ్యవహారంలా ఉంది తప్పించి అర్థవంతంగా లేదు. ఒకవేళ ఈ నిషేధంలో మోడీ ప్రమేయం ఉందని ఏవైనా వార్తాకథనాలో లేక ఆధారాలో ఉన్నట్టయితే వాటిని తెలుపగలిగితే బావుంటుంది.

No comments:

Post a Comment